మన రాష్ట్రం... మన ప్రజా..
బంగారు తెలంగాణ పునర్ నిర్మాణం లో
బాగస్వాములవుదాం రండి ....
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
మళ్లీ గాలి వీచింది... కాంగ్రెస్ కకా వికలమైంది... 20 సంవత్సరాల తరువాత మళ్లీ అదే జరిగింది. అప్పుడు ఎన్.టి.ఆర్ ఇప్పుడు కె.సి.ఆర్ రూపం లో విప్లవాత్మకమైన మార్పుకు కారణ భూతులయ్యారు . ఓటమి అంటే ఎరుగని బడా నాయకులను సైతం సునామీలా ముంచ్చేత్తింది.
ఊహించని స్థానాల్లో సైతం సీనియర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఎధుర్కున్నారు. కె.సి.ఆర్ అనూహ్యంగా తన ప్రచారం లో అన్ని పార్టీ ల కన్నా అగ్ర భాగాన నిలిచారు. తాను చెప్పదల్చుకున్న మాటలను సూటిగా చెప్పి తెలంగాణా ప్రజల హృదయాలను అమాంతంగా కొల్లగొట్టారు. కె.సి.ఆర్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారని ముందే ఉహించిన రాజకీయ పరిశీలకులు, ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తారని మాత్రం ఉహించి ఉండరు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రము ఇచ్చి రెండు చేతులు కాల్చుకున్నా కాంగ్రెస్ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న ఈ సమయంలో ఆంధ్రా పై ముందే ఆశలు వదులుకున్నా, కనీసం తెలంగాణాలో అధికారంలోకి రాకపోవడం పరిశీలకులను సైతం ఆశ్చర్యం లో పదెసింది. అంతేకాకుండా కనీసం ప్రతి పక్ష హోదా కూడా లేకుండా చతికిల పడడం, పాపం.. కాంగ్రెస్ అనే విధంగా పరిస్థితులు మారాయి.
జీవితాల్లో హరి విల్లు విరుస్తుందానే కొంగ్రొత్త ఆశలతో పట్టం కట్టిన కొత్త రాష్ట్ర పాలన కె.సి.ఆర్ ఏవిధంగా నిభాయిస్తారో చూడాలి మరి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ఎలా ముందుకు వెళతారనేది అందరిలో నెల కొన్న ఉత్కంటత.
ప్రజాతీర్పును గౌరవిస్తూ ఓడిన వారు తిరిగి తమ ప్రాభవాన్ని చాటుకునే ప్రయత్నంలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇదే అవకాశంగా తీసుకోవాలి. ఓటమితో కలత చెందకుండా, అందుకు ఇతరులను నిందించకుండా ఆత్మ విమర్శతో ముందుకు సాగాలి. అప్పుడే అన్ని అయిపోలేదు అని గుర్తు పెట్టు కోవాలి.
తెలంగాణ వాచ్ డాగ్ లా ఉంటానని చెప్పిన కె.సి.ఆర్. కాంగేస్స్ లో విలీనం కాకుండా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఒంటరి పోరు చేసి అనుకున్నది సాధించారు. కాని ఇప్పుడే అసలు కథ మొదలయింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రణాళికా బద్ధంగా పునర్నిర్మాణం జరిగే విధంగా చూడాల్సిన భాద్యత తెలంగాణ పౌరులందరి పై ఉందని చెప్పక తప్పదు.. జయహో తెలంగాణా.....