BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

11, ఫిబ్రవరి 2010, గురువారం

Dear Manthaniates...

I have no hesitation to bring this one in your notice.. Just it is in an information that VAARTHA telugu daily is going to publish Special supplement on 20th of February 2010. Some may know The book consist of Articles on important places, persons, piligrim centers and more.. Manthani will occupy most of the pages in the book with immense history, culture. So in this matter so many officials, nonofficials, welwishers will give advertisements.

For that purpose we are giving information to the interested persons all over india and abroad...

* If any one interested by person or group can contact me by phone or email given below..

* It is just for information only.. dont think otherwise..


Dahagam Srinivas,
Staff Reporter, Vaartha..
MANTHANI..
Mobile :9848640121
email: dahagam.srinivas@gmail.com
mn.rc.news@gmail.com

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

శివస్వరూపమే రుద్రాక్ష

శివస్వరూపమే రుద్రాక్ష .
.

పరమశివుని కళ్లనుంచి రాలిన కన్నీటి బిందువులే విత్తనాలుగా మారి మొక్కలై పెరిగాయి. ఆ మొక్కలే రుద్రాక్ష మొక్కలు. అవి ఎదిగి, ఈ భూతలానికి రుద్రాక్షలను పరమేశ్వర ప్రసాదంగా మారాయి.

మహా శివ రాత్రి సందర్బంగా విధాత అందిస్తున్న వ్యాసం..

రుద్ర అంటే శివుడు. అక్ష అంటే అశృవులు లేదా కళ్లు అని అర్థం చెబుతారు. కాబట్టి రుద్రాక్ష అంటే- శివునినేత్రాలనుంచి ఉద్భవించినవని అర్థం. కాబట్టే వాటికిపవిత్రత, పూజనీయత చేకూరిందన్న మాట. ఇంతెందుకు రుద్రాక్ష సాక్షాత్తూ శివుని ప్రతిరూపమే. అందుకే రుద్రాక్షలగురించి శివుడే ఇలా చెప్పాడు.

'నా నేత్రాలనుంచి జాలువారిన ఈ బిందువులతో రుద్రాక్ష వృక్షం పుట్టింది. కాబట్టి నా అనుజ్ఞ మేరకు ఈ రుద్రాక్షలు సమస్తమైన ప్రాణకోటికి మేలు కలిగిస్తూ వారి పాపాలను పరిహరింపచేసేందుకు ఉపకరిస్తా' యని చెప్పాడు. దీన్ని బట్టి రుద్రాక్షలకు ఎంత విలువో అర్థం చేసుకోవచ్చు.

శివునికీ రుద్రాక్షలకు విడదీయలేని బంధం ఉందన్న మాట. రుద్రాక్షలు ధరిస్తే శివుణ్ని మనవద్ద ఉంచుకు న్నట్టే. అంతేకాకుండా

రుద్రాక్ష చ శివాక్షం చ సర్వాక్ష భూతనాశనమ్‌|

పావన లీల కంఠాక్ష రక్షంచ శివప్రియమ్‌||

రుద్రాక్ష ధారణంవల్ల నాలుగు విధాలుగా లాభం. అంటే- జ్ఞానసిద్ధి, కార్యసిద్ధి, అన్నపూర్ణసిద్ధి, కామ్యసిద్ధు లనే నాలుగు సిద్ధులు కలుగుతాయన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే రుద్రాక్ష ధారణం వల్ల మనిషి బతికినంత కాలం అన్నీ కరతలామలకం కావడమే కాక, మరణానంతరం శివసాయుజ్యం పొందుతాడన డంలో అతిశయోక్తి రవ్వంతైనా లేదు.

ఈ ఒక్క రుద్రాక్షలో అనేకరకాలైన దైవశక్తులు దాగి ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల సమస్తమైన దుష్ట గ్రహ పీడలు, భయాలూ, సర్వదుఃఖాలూ నశిస్తాయి.

ఈ సృష్టిలోని సర్వప్రాణులు పరమేశ్వరుడంటే ఎలా ఇష్టపడతారో రుద్రాక్షను ధరించిన వాళ్లంటే పరమేశ్వరుడు అంతగా ఇష్టపడతాడు. ఈ రుద్రాక్షను ఎవరూ ధరించినా వారు శివునికి ప్రీతిపాత్రమైన వారే అవుతారు. వారెంతటి పాపాత్ములైనా సరే! రుద్రాక్ష ధారణంతో ఆ పాపాలన్నీ పరిహారమై పవిత్రులై పోతారన్న మాట. అదీ రుద్రాక్షలకున్న ఘనత.

రుద్రాక్షలు ధరించిన వారికి కోరుకున్నది లభిస్తుంది. అనంతమైన భోగభాగ్యాలు కలుగుతాయి. ఎవ్వరికో గానీ లభ్యంకాని మోక్షాన్ని లభింపచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే పార్వతీపరమేశ్వరుల కరుణాకటాక్షా లను పొందేందుకు వీలు కలుగచేయడం మరో ఎత్తు. ఈ రుద్రాక్షలను కేవలం మగవారే కాదు, స్త్రీలు కూడా ధరించవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. ఇవి ధరించిన స్త్రీలకు అనంతమైన సౌభాగ్యసిద్ధి కలుగుతుంది. ఇంకా రుద్రాక్షలను పూజామందిరంలో పెట్టి ఏ ఇంటిలోనైతే ప్రతినిత్యం పూజిస్తారో ఆ ఇంటివేపు ఏ దుష్టశక్తీ కన్నెత్తి చూడలేదు. భూతప్రేతవారింట ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

ఈశ్వరునికి ప్రతిరూపంగా రుద్రాక్షనెలాగూ చెప్పు కున్నాం. రుద్రాక్షంటే శివుడే కాదు బ్రహ్మవిష్ణువులు కూడా కొలువై ఉన్నారట. ఎలాగంటే- త్రిమూర్తులది విడదీయలేని బంధం కదా! అందుకే రుద్రాక్షముఖ భాగాన్ని బ్రహ్మగానూ, క్రిందిభాగాన్ని విష్ణువుగానూ చెబుతారు. ఇక మధ్యభాగం ఈశ్వరుడన్న మాట. ఈ విధంగా ఒక్క రుద్రాక్షను పూజిస్తే త్రిమూర్తుల్నీ పూజించి నట్టవుతుంది. తద్వారా భక్తి, శక్తి, ముక్తి మూడింటిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు!....

రుద్రాక్ష ధారణం దృష్ట్వా శివో విష్ణుఃప్రసీదతి|

దేవీ గణపతిః సూర్యః సూరాశ్యాన్యేపి పార్వతి||

రుద్రాక్షలు ధరించిన వారు ఒక్క శివునికే కాదు, విష్ణువు, దుర్గాదేవి, గణపతి, సూర్యుడు, పార్వతి వీరం దరికీ కూడా ఇష్టుడవుతాడు. వీరన్దరి కరుణా కటాక్షాలు వీరికి పుష్కళంగా లభిస్తాయన్న మాట.

రుద్రాక్షలు


పంచముఖి

రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు , ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మద్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మద్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

రకాలు

వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.

  • ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)

అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  • ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)
దీనిని శివ పార్వతి రూపంగా నమ్ముతారు.
  • త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)

దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  • చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)

నాలుగు వేదాల స్వరూపం

  • పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)

పంచభూత స్వరూపం

  • షట్ముఖి (ఆరు ముఖములు కలది)

కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  • సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)

కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  • అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)

విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  • నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  • దశముఖి (పది ముఖాలు కలిగినది)

దశావతార స్వరూపం. జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

అసలైన రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు

క్రింది పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం.

  • రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
  • నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.
  • నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
  • నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.





2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఈ పుస్తకాన్ని చదవండి..

ఈ పుస్తకాన్ని చదవండి..
'సంకష్ట హర మహా గణేశ వ్రాత విధానం పుస్తకాన్ని మంగళంపల్లి వేణుగోపాల శర్మ సంకలనం చేశారు..
ఎంతో ఉపయోగకరమైన ఈ అమూల్యమైన పుస్తకవిస్కరణ ౨వ తేదిన సాయంత్రం ౬ గంటలకు కరీంనగర్ గంజ్ గణేష్ మందిర్ లో ఆవిష్కరిస్తున్నారు

1, ఫిబ్రవరి 2010, సోమవారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము అవుతుందా..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందా.. ఎప్పుడు...?
ఒక రాజకీయ విశ్లేషణ...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఎప్పుడు ఏర్పడుతుది. అనే ప్రశ్న తెలంగాణ ప్రజల మదిలో నిరంతరం అలజడికి కారణం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సుముఖతతో ఉందా.. లేదా.. అనే విషయాలను చర్చించుకుంటే. కొన్ని విషయాలు భోధ పడుతునై..

తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాల మాట ఎలా ఉన్నా, కేంద్రం మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము దిశలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.. తెలంగాణ ఫై కేంద్రానికి ఒక్క సరిగా ప్రేమ పుట్టిందని మాత్రం నా ఉద్శం కాదు. కానీ. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, పరిణామాలు మాత్రం తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు, కేంద్రం అనుసరిస్తున్న ధోరణితో అర్థం అవుతున్నది.. ఒకసారి వెనక్కి వెళితే కొన్ని సంఘటనలు ఈ విషయాలను ద్రువికరిస్తున్నట్లు నిర్ధారణకు రావచ్చు..

- సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ ప్రాంతంలో టీ డి పీ తో పోత్హు పెట్టుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ తన అస్తిత్వానికి భంగం కలిగిన. మిత్ర పక్షాల గెలుపులో క్రియా శిలకంగా వ్యవహరించింది.. ఈ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందొ, గత ఎన్నికల్లో.. ఈ ఎన్నికల్లో నేర్పిన పాఠాలు, తెలంగాణ ప్రాంతంలో పట్టు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి సాదించే దిశలో చేస్తున్న ప్రయత్నంలో బాగమే ప్రత్యేక రాష్ట్రము అని భావించ వచ్చు..

- ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు బలంగా కేంద్రాన్ని శాశించే రీతిలో ఉన్న సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అడుగులు వేస్తున్దనే విషయం రాజకీయ పరిశీలకులకు తెలిసిన సత్యమే.. గతంలో మహారాష్ట్ర నుండి గుజరాత్, పంజాబ్ నుండి చండీగడ్ తో పాటు ఈ మధ్య ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఈ విధానం లో ఏర్పదినవేనని ఆయ రాష్ట్రాల చరిత్ర చెబుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మూలంగా దెబ్బ తినేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అనే విషయం అక్షర సత్యం. కేంద్ర మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్న సమయంలో ఈ నిర్ణయాలు తప్పని సరి అని చరిత్ర చెపుతున్న సత్యం.
ఇవే కాకుండా అంతర్గతంగా కేంద్రం కొన్ని మార్పులు, కొంతమంది వ్యవహించే తీరు అంతర్గత భద్రత దేశ ఉనికికి ప్రమాదకరమైన వాటిని సైతం పరిగణలోకి తీసుకొని, పరిష్కారానికి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రము మాత్రమే మంచి నిర్ణయమని భావించి ఉండవచనే వాదనలు వినిపిస్తునాయి. ఆ వివరాలు ప్రస్తుతం చర్చించడం భావ్యం కాదు అని నా ఆలోచన.

- కే సి ఆర్ ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే కొన్ని విషయాలు భోధ పడుతాయి. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ తో పాటు తెలంగాణా విషయంలో తీసుకున్న అభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ కూడా అందులో భాగమేనని తెలుస్తున్నది. అయితే తెలంగాణా రాష్ట్రము విషయంలో కేంద్రం నిక్కచిగా ఉన్నట్లు ఆయా పార్టీల అధినేతలు సైతం తెలుసుకోలేక పోవడం వాళ్ళనే ప్రత్యేక రాష్ట్రము తమకు సమ్మతమేనంటూ అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే అనుకూలమని చెప్పినట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ఉహించని ప్రకటనతో కంగు తిన్నారు.

ఒక కేంద్ర హోం మంత్రి భారత ప్రభుత్వం తరపున ప్రకటిస్తున్నట్లు మీడియా ముందు చెప్పడం అంటే ఆషామాషీ కాదనే విషయం కూడా తెలుసుకోవాలి.
తెలంగాణకు తాము వేతేరేఖం కాదు అని చెప్పిన సీమంద్ర కు చెందినా నేతలు ఒక్క సరిగా ఉలిక్కి పడ్డారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడితే తమ ప్రాంతానికి జరిగే మంచిని మరిచి పోయి స్వతహాగా తమకు, తమ ఆస్తులకు జరిగే నష్టం కళ్ళ ముందు సినిమా రీలుల కదలాడింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర, రాయలసీంఅ ప్రాంతాల్లో అభివృధికి నోచుకోని ఎన్నో గ్రామాలూ పురోగతిలో పయనిస్తయనే సత్యాన్ని బయట పదనీకుండా తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనే మాయ మాటలతో సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తీసుకవచ్చి అక్కడి ప్రజలను సైతం మభ్య పెడుతున్నారనే వాదన ఆయ ప్రాంతాలకు చెందినా మేధావులు, సాధారణ ప్రజలు వినిపిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా ఏర్పడుతుందనే విషయాన్నీ గ్రహించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు జాగ్రతగా తెలంగాణాలో సైతం భావిష్యత్హులో తెలుగు దేశం పార్టీ బట్ట కట్టాలనే ఆలోచనతో రెండు పడవలను సిధం చేసుకున్నట్లు కనిపిస్తున్నది. పైగా రాజ్యాంగ సంక్షోభం ఫై ద్రుస్టి సారించినట్లు కనిపిస్తున్నది. మిగతా పార్టీలు జాతీయ పార్టీలు కావడం వాళ్ళ పెద్దగ సమస్యలు రావనేది నిర్వివాద్ అంశం.

ప్రస్తుతం ఉద్యమం ఉగ్ర రూపం దాల్చినా.. చల్లబడినా కేంద్రం తాను అనుకున్న లక్ష్యం వైపు వాడి వాడిగా కాకుండా సాఫీగా నైన, ఆచి తూచి అడుగులు వేస్తున్న విషయాన్నీ గమనిచ గలగాలి.. ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ మూలంగా పరిణామాలు భేరిజు వేసుకుంటూ పని ముగించాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వైపు రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, కేంద్రం ఫై ఒత్హిది లేకుండా చూసుకొని ప్రక్రియను పూర్తి చేయవచనే భావన కలుగుతున్నది. ౨౦౧౪ ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాలుగా విడి పోయినా, రెండు రాస్త్రాలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే స్వార్థం ఆ పార్టీకి ఎందుకు ఉండ కూడదు అనే వాదన కూడా వినిపిస్తున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఇరు ప్రాంతాల ప్రజలు అదే పార్టీ అధికారంలో ఉండాలని భావిస్తున్నారా లేదా అనే విషయం కూడా చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి..

ఈ తర్జన బర్జనలు ముగిసే నాటికీ కొన్ని నెలల వ్యవధి మాత్రమే పడుతుంది..
ఏది ఏమయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము మన కళ్ళ ముందు ఆవిష్కరించడం తధ్యం..
శుభం భూయాత్...

-

-