BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

శివస్వరూపమే రుద్రాక్ష

శివస్వరూపమే రుద్రాక్ష .
.

పరమశివుని కళ్లనుంచి రాలిన కన్నీటి బిందువులే విత్తనాలుగా మారి మొక్కలై పెరిగాయి. ఆ మొక్కలే రుద్రాక్ష మొక్కలు. అవి ఎదిగి, ఈ భూతలానికి రుద్రాక్షలను పరమేశ్వర ప్రసాదంగా మారాయి.

మహా శివ రాత్రి సందర్బంగా విధాత అందిస్తున్న వ్యాసం..

రుద్ర అంటే శివుడు. అక్ష అంటే అశృవులు లేదా కళ్లు అని అర్థం చెబుతారు. కాబట్టి రుద్రాక్ష అంటే- శివునినేత్రాలనుంచి ఉద్భవించినవని అర్థం. కాబట్టే వాటికిపవిత్రత, పూజనీయత చేకూరిందన్న మాట. ఇంతెందుకు రుద్రాక్ష సాక్షాత్తూ శివుని ప్రతిరూపమే. అందుకే రుద్రాక్షలగురించి శివుడే ఇలా చెప్పాడు.

'నా నేత్రాలనుంచి జాలువారిన ఈ బిందువులతో రుద్రాక్ష వృక్షం పుట్టింది. కాబట్టి నా అనుజ్ఞ మేరకు ఈ రుద్రాక్షలు సమస్తమైన ప్రాణకోటికి మేలు కలిగిస్తూ వారి పాపాలను పరిహరింపచేసేందుకు ఉపకరిస్తా' యని చెప్పాడు. దీన్ని బట్టి రుద్రాక్షలకు ఎంత విలువో అర్థం చేసుకోవచ్చు.

శివునికీ రుద్రాక్షలకు విడదీయలేని బంధం ఉందన్న మాట. రుద్రాక్షలు ధరిస్తే శివుణ్ని మనవద్ద ఉంచుకు న్నట్టే. అంతేకాకుండా

రుద్రాక్ష చ శివాక్షం చ సర్వాక్ష భూతనాశనమ్‌|

పావన లీల కంఠాక్ష రక్షంచ శివప్రియమ్‌||

రుద్రాక్ష ధారణంవల్ల నాలుగు విధాలుగా లాభం. అంటే- జ్ఞానసిద్ధి, కార్యసిద్ధి, అన్నపూర్ణసిద్ధి, కామ్యసిద్ధు లనే నాలుగు సిద్ధులు కలుగుతాయన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే రుద్రాక్ష ధారణం వల్ల మనిషి బతికినంత కాలం అన్నీ కరతలామలకం కావడమే కాక, మరణానంతరం శివసాయుజ్యం పొందుతాడన డంలో అతిశయోక్తి రవ్వంతైనా లేదు.

ఈ ఒక్క రుద్రాక్షలో అనేకరకాలైన దైవశక్తులు దాగి ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల సమస్తమైన దుష్ట గ్రహ పీడలు, భయాలూ, సర్వదుఃఖాలూ నశిస్తాయి.

ఈ సృష్టిలోని సర్వప్రాణులు పరమేశ్వరుడంటే ఎలా ఇష్టపడతారో రుద్రాక్షను ధరించిన వాళ్లంటే పరమేశ్వరుడు అంతగా ఇష్టపడతాడు. ఈ రుద్రాక్షను ఎవరూ ధరించినా వారు శివునికి ప్రీతిపాత్రమైన వారే అవుతారు. వారెంతటి పాపాత్ములైనా సరే! రుద్రాక్ష ధారణంతో ఆ పాపాలన్నీ పరిహారమై పవిత్రులై పోతారన్న మాట. అదీ రుద్రాక్షలకున్న ఘనత.

రుద్రాక్షలు ధరించిన వారికి కోరుకున్నది లభిస్తుంది. అనంతమైన భోగభాగ్యాలు కలుగుతాయి. ఎవ్వరికో గానీ లభ్యంకాని మోక్షాన్ని లభింపచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే పార్వతీపరమేశ్వరుల కరుణాకటాక్షా లను పొందేందుకు వీలు కలుగచేయడం మరో ఎత్తు. ఈ రుద్రాక్షలను కేవలం మగవారే కాదు, స్త్రీలు కూడా ధరించవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. ఇవి ధరించిన స్త్రీలకు అనంతమైన సౌభాగ్యసిద్ధి కలుగుతుంది. ఇంకా రుద్రాక్షలను పూజామందిరంలో పెట్టి ఏ ఇంటిలోనైతే ప్రతినిత్యం పూజిస్తారో ఆ ఇంటివేపు ఏ దుష్టశక్తీ కన్నెత్తి చూడలేదు. భూతప్రేతవారింట ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

ఈశ్వరునికి ప్రతిరూపంగా రుద్రాక్షనెలాగూ చెప్పు కున్నాం. రుద్రాక్షంటే శివుడే కాదు బ్రహ్మవిష్ణువులు కూడా కొలువై ఉన్నారట. ఎలాగంటే- త్రిమూర్తులది విడదీయలేని బంధం కదా! అందుకే రుద్రాక్షముఖ భాగాన్ని బ్రహ్మగానూ, క్రిందిభాగాన్ని విష్ణువుగానూ చెబుతారు. ఇక మధ్యభాగం ఈశ్వరుడన్న మాట. ఈ విధంగా ఒక్క రుద్రాక్షను పూజిస్తే త్రిమూర్తుల్నీ పూజించి నట్టవుతుంది. తద్వారా భక్తి, శక్తి, ముక్తి మూడింటిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు!....

రుద్రాక్ష ధారణం దృష్ట్వా శివో విష్ణుఃప్రసీదతి|

దేవీ గణపతిః సూర్యః సూరాశ్యాన్యేపి పార్వతి||

రుద్రాక్షలు ధరించిన వారు ఒక్క శివునికే కాదు, విష్ణువు, దుర్గాదేవి, గణపతి, సూర్యుడు, పార్వతి వీరం దరికీ కూడా ఇష్టుడవుతాడు. వీరన్దరి కరుణా కటాక్షాలు వీరికి పుష్కళంగా లభిస్తాయన్న మాట.

రుద్రాక్షలు


పంచముఖి

రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు , ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మద్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మద్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

రకాలు

వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.

  • ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)

అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  • ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)
దీనిని శివ పార్వతి రూపంగా నమ్ముతారు.
  • త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)

దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  • చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)

నాలుగు వేదాల స్వరూపం

  • పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)

పంచభూత స్వరూపం

  • షట్ముఖి (ఆరు ముఖములు కలది)

కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  • సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)

కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  • అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)

విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  • నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  • దశముఖి (పది ముఖాలు కలిగినది)

దశావతార స్వరూపం. జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

అసలైన రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు

క్రింది పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం.

  • రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
  • నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.
  • నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
  • నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.





కామెంట్‌లు లేవు: