BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

బతుకమ్మ సంబరాలు


బతుకమ్మ సంబరాలు




















మహలక్ష్మి దేవాలయంలో సహపంక్తి బోజనాలు




మహలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మా మంత్రివర్యులు శ్రీధర్ babu







గోపాల కాల్వలు కార్యక్రమం కరీంనగర్ జిల్లా మంథని మహలక్ష్మి దేవాలయంలో





గోపాల కాల్వలు..

గోపాల కాల్వలు కార్యక్రమం కరీంనగర్ జిల్లా మంథని మహలక్ష్మి దేవేఅలయంలో



22, సెప్టెంబర్ 2009, మంగళవారం

కొన్ని తెలుగు పత్రికల శైలి మారాలి

కొన్ని తెలుగు పత్రికల శైలి మారాలి ..!

తెలుగు పత్రికల శైలి అధునాతన రీతిలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరం కన్నా ఎక్కువ పొగడడం, మితిమీరి తెగడడం తెలుగు పత్రికలకు అలవాటుగా మారింది. అయితే పోటీ ప్రపంచంలో ఇది సాదారణమని భావిస్తే పాఠకులను ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నామనే మౌలిక విషయాన్నీ మరిచి పోతున్నారు. పత్రికలూ ఎలా వ్రాస్తే, పాఠకులు అలా స్పందిస్తరనే బూర్జువా అభిప్రాయాన్ని తొలగించుకోవల్సిన అవసరం ఉంది. పత్రికలు చదివేవారు, అధ్యయనం చేసేవారు, తమ పేరు, ఫోటో చూసుకొని సంతోషపడేవారు, తమకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, పార్టీ paranga వ్యతిరేకంగా ఉన్నవారికి సంబంధించిన నెగటివ్ వార్తలు ప్రచురితమైతే సంతోషించే వారు చాలామంది ఉంటారు. అలాగే తమకు ఆత్మ బంధువులు, ఇస్తమినవారు, తమ నాయకులకు సంబంధించిన పాజిటివ్ ప్రచురణలు కూడా అదే స్థాయిలో గొప్పగా ఫిలయ్యేవారి సంఖ్య కూడా ఉంటుంది. వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వార్తలు ఎక్కువ స్థాయిలో ప్రచురించడం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర.

అయితే.. కొన్ని పత్రికలు ఉన్నది ఉన్నట్లు.. కాకుండా తమదైన శైలిలో వక్రీకరించడం పరిపాటిగా మారింది...
అది ఈ స్థాయిలో జరుగుతున్నది అనే విషయాన్నీ చర్చిద్దాం..
పాఠకులకు అందిచాల్సిన సమాచారాన్ని సైతం కొన్ని పత్రికలూ హైజాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ, దేశ, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఉన్న్డునట్లు అందిచాల్సిన పత్రికలూ, స్వంత కవిత్వాన్ని జోడించి, మాల్ మసాల గుప్పించి పాఠకులను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చాల చేస్తున్నట్లు గమనించే వారికి ఇట్టే తెలిసి పోతుందనే నగ్న సత్యాన్ని ఇప్పటికయినా తెలుసుకోవాలి.

నిజమయిన వార్తలు అందించే పవిత్ర వ్రుతిలో ఉన్నాజర్నలిస్టులు సయితం, యాజమాన్యాన్ని ఒప్పించేందుకు సహసించలేని స్థితిలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారునగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అదే ప్రవ్రుత్చిని అలవ్రుచుకొని మనసు చంపుకొని ఎంతమంది వ్యవహరిస్తున్నారో...

ఒక తెలుగు దిన పత్రిక వ్యతిరేఖంగా వ్రాసేందుకు అలవాటు పడి, వార్తలఉ, ఎడిటోరియల్, కాలమ్స్ తో పాటు కనీసం గ్రహ ఫలాలు కూడా వ్యతిరేఖంగా ఉండేలా ప్రచురించడం గమనార్హం. అంటే పాఠకులను అన్ని విధాలుగా నెగటివ్ ఆలోచనలు చేసే విధంగా, నిరాశ, నిస్పృహ నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలియని అలజడి పాఠకుల్లో జనిస్తుంది. దీంతో వ్యతిరేఖంగా ఆలోచించే పాఠకుడు తప్పని పరిస్థుల్లో, తనకు తెలియకుండానే విషపురితమవుతఆడు. ఇది ఎవరిని ఉధరించెందుకో అర్థం కాదు...

ఇప్పటికయినా మనసు మార్చుకొని, పాఠకులకు ధైర్యాన్ని, మంచిని, పోసిటివ్ దృక్పథాన్ని, ఆశావాద తత్వాన్ని అందించే విధంగా పత్రికలను మల్చకుంటే, జరిగే దుష్పలితాలకు కారణ భూతాలు పత్రికలేనని భావించే ప్రమాదముంది...



13, సెప్టెంబర్ 2009, ఆదివారం

ముఖ్య మత్రి జగన్ అవుతారా....!

ముఖ్యమంత్రి జగన్ అవుతారా....!

ముఖ్య మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాభిమానాన్ని చూరగొన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అకాల మృత్యు ఒడిలోకి చేరుకున్న తరువాత ఆంధ్ర రాజకీయాల్లో చర్చ ఉపన్డుకుంది. తదుపరి ముఖ్య మంత్రిగా అధిష్టానం ఎవరిని నియమిస్తుంది అనే ప్రశ్న ఉదయించింది. ప్రస్తుత రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఆయన కుమారుడే అందుకు సరియన వాడుగా కనిపిస్తున్నది. అధిష్టానం సరియన సమయంలో సరియన నిర్ణయం తిసికోకుంటే పరిస్థితి చేయి ధాటి పోయే అవకాశాలూ ఎక్కువ ఉన్నాయ్. జగన్ మోహన్ రెడ్డిని సి. ఎం. చేస్తే ఎవరికీ లాభం అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకే అని చెప్పక తప్పదు. ఈ విషయంలో కొద్ది మండి ముఖ్యమంత్రి పదవి ఆశ ఉన్నా సీనియర్ నాయకులూ తప్ప, జగన్ అందరికి ఆమోద యోగ్యమైన నాయకుడని ఎప్పుడో తేలిపోయింది..


అధిష్టానం మనసులో జగనే ఉన్నాడా...


ఈ విషయంలో సుక్ష్మంగా పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే గ్రహించవచు. మన రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నా కోది మంది మంత్రులకు అధిష్టానం సూచనా ప్రాయంగా ఈ విషయాన్నీ తెలియజేస్తూ, అందుకు అవసరమైన బాక్రౌండ్ తయరుకు గ్రీన్ సిగ్నల్ ఇయ్యడం వల్లే జరుగుతున్న పరిణామాల నేపద్యమని తెలిసిపోతుంది. సీనియర్ నాయకులను నొప్పించకుండా సామరస్యంగా ఎంపిక చేయాలన్న దృక్పథంలో అధిష్టానం జాగ్రతగా పావులు కడుపుతన్నట్లు తెలుస్తున్నది. అలాగే ఈ సమయంలో వ్యతిరేఖ వర్గంపై కుడా దృష్టి సారించేందుకు అవకాశంగా భావిస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి.


జగన్ ఎందుకు కావాలి..


జగన్ సి.ఎం. ఐతే తప్ప కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదనేది నిర్వివాదాంశం. అతడైతేనే తండ్రి ఉదేస్తలను, కళలను నిజం చేసేందుకు ఆశక్తీ చూపే అవకాశం ఉంది. లేకుంటే ౬నెలలకు ఒక ముఖ్య మంత్రి మారే అవకాశాలూ కాంగ్రీ పార్టీల చరిస్త్ర మనకు అవగతమే..


- విధాత

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

విధాత


ఒక మహనీయుని నిష్క్రమణ
జీవితమంటే పదిమందికి మేలు చేయడమే అలాంటప్పుడే ఆ జీవితానికి సార్థకత చేకురుతుది..

ఆ కోవలోకి వచ్చేవారు చాలా కొధ్హి మాత్రమే ఉంటారు..

వారిలో ఒకరు డాక్టర్ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి.

ఆయన మహాభినిష్క్రమణ తెలుగు లోగిళ్ళలో విషాదం నింపింది..

ఆ మహా నాయకునికి నివాళులు అరిపిస్తూ... అశ్రు నయనాలతో...


-విధాత