
తెలంగాణా ప్రకంపనలు..
ఇదీ చరిత్ర..

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రము ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ. ౧౯౪౭ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, ఈ ప్రాంత వాసులు ఆ పరిమళాలు ఆశ్వాదించని రోజులు. నైజాం ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నారనేది నిర్వివాదంసం. అదే సమయంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం ౧౯౪౮లొ నైజాం ప్రభుత్వాన్ని గద్దె దింపి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు చేసిన విషయం జగత్విదితం. ౧౯౫౬ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రము గానే పరిగనించ బడింది. పొట్టి శ్రీరాములు అనే మహానుభావుదు మద్రాస్ రాష్ట్ర ఏలుబడిలో ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష వహించి చరిత్రలో అమరజీవిగా నిలిచిపోయాడు. ఈ సంఘటనతో ఉద్యమం మరింత ఉపన్డుకుంది. మద్రాస్ రాష్ట్రము నుండి ఆంద్ర రాష్ట్రము వేరుగా ఏర్పడి, కర్నూల్ రాజధానిగా రూపొందింది. ఆ సమయంలో కూడా రాష్ట్ర విదిపోరాదని మద్రాస్ పరిదిలో, ఇప్పటిలాగే గొడవలు జరిగిన మాట చరిత్ర చెపుతున్న సత్యం.
తెలుగు పేరున మొదటి అడుగు..
౧౯౫౬లొ తెలుగు మాట్లాడే వారు అందరు ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఆలోచన చేసిన ఆంధ్ర పాలకులు తెలంగాణా ప్రాంత ప్రజలు వ్యతిరేకించినా, ఆ పట్టు సాదించే ప్రక్రియలో చివరికి విజయం సాదించారు. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ కు దశాబ్దాలుగా పాలకులుగా ఉండి, అటు తమ ప్రాంతాన్ని, ఇటు తెలంగాణ ప్రాంతాన్ని అభివృధి చేసే విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. కొన్ని ప్రాంతాలు తప్ప ఇప్పటికి అభివృధికి నోచుకోని ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయనడంలో సందేహం లేదు. పాలన పరంగా దృష్టి సారించకుండా కేవలం తమ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమె అధికారాన్ని ఉపయోగించుకున్నారని చెప్పకనే తెలుస్తునది.

తెలంగాణ ఉద్యమం మొదటి అంకం..
అయితే మీ ఆంధ్ర రాష్ట్రము మీరు ఎలుకోండి. మా తెలంగాణ మాకివ్వండి అంటూ వివక్షకు గురవుతున్నట్లు గుర్తించిన అప్పటి విద్యార్థి లోకం ఉద్యమానికి నాంది పలికింది. తెలంగాణ ప్రజా సమితి పేరున జరిగిన ఈ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. నెలల తరబడి జైలు జీవితం అనుభవించారు, రెండు సంవత్సరాలు చదువులు పోగొట్టుకున్నారు. చివరకు ఈ ఉద్యమం రాజకీయ నాయకుల చేతిలో పడింది. పదవులు, పందేరలకోసమే పుట్టే కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఆత్మర్పనాన్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షునిగా వ్యవహరించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి డిల్లీ పాలకులకు గులాముగా మారాడు. శ్రీమతి ఇందిరా గాంధీ చెప్పిన మాటకు డూ.. డూ బసవన్నలా తల అడ్డంగా ఉపీ, పదవులకోసం తెలంగాణను తాకట్టు పెట్టాడు.

మళ్లీ జై తెలంగాణ..
౫౦ సంవత్సరాలుగా అన్ని రంగాల్లో, స్థాయిలో వివక్షకు గురైన తెలంగాణ బిడ్డలు మల్లి మూడవ నేత్రం తెరిచారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు కదిలారు. ఉవ్వేతున ఎగుస్తున్న ఉద్యమం తాలుకు సెగలు డిల్లీకి తాకినాయ్. దీనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటున్న కేంద్రం సమయం కోసం నిరీక్షిస్తూనే ఉంది. దీనికి తోడు కే సి ఆర్ ఆమరణ దీక్ష మరింత వెడిపుట్టించింది. విద్యార్థి లోకం శివమేత్తింది. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయమని పరుగులు తీసింది. వెంట వెంటనే పావులు కదిలాయి.. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంబించినట్లు ప్రకటించింది.....
తెలంగాణపై ఓర్వలేని తనం..
కాని తెలంగాణ ప్రకటన చేశారనే సంతోషాన్ని కనీసం ౬ గంటలు కూడా అనుభవించకుండా చేశారు పాలకులు. తెలంగాణ విడిపోతే ఏమేమో జరుగుతుందని మాయ మాటలతో జనాన్ని ఉరికోల్పుతూ సమేక్యంద్ర అంటూ నినదిస్తూ అందరం కలిసుండాలి, తెలంగాణ విడిపోవడం వాళ్ళ నష్టపోతాం అని నూరిపోస్తూ ఆంధ్ర ప్రజలను రేచ గొడుతున్నారు. హైదరాబాద్ పట్నం ఫై కన్నేసిన ఆంధ్ర పాలకులు ఆ దిశలో తమ ఉద్యమాన్ని సాగిస్తున్నారు.. పార్టీలు, సిదంతలకు తిలోదకాలు వదిలి పూనకం వచ్చిన వారిలా ఊగి పోతూ గగ్గోలు పెడుతున్నారు. వారు చేస్తున్న నిరాహార దీక్షలు ఆస్తులు కాపాడుకోవడానికే కాని ఆంద్ర ప్రజలను ఉద్ధరించడానికి కాదని అందరు గుర్తిస్తే తప్పా, వారి విష కోరల నుండి విముక్తి లబించదు. ఆంద్ర, రాయలసీమ ప్రాంతానికి చెందినా సాదారణ ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో.. పాపం..