భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒక చాయివాలా మనదేశం లోని అత్యన్నత పదవిలో ఒకటైన ప్రధాని సీటు అధీష్టించడం మన దేశ అత్యున్నత ప్రజాస్వామిక విలువలకు తార్కాణమేనని చెప్పవఛు. అంటే ప్రజాస్వామ్య యుత దేశం లో ఎవరైనా సరే, పట్టుదల, దీక్ష, సంకల్పం ఉంటే ప్రధాని పదవే కాకుండా, అత్యున్నత శిఖరాలు అందుకో వచ్చని మోడీ రుజువు చేశారు. ప్రతి భారతీయుడు తాను ఏమి కావాలని అనుకుంటున్నారో, ఒక సమున్నత లక్ష్యంతో ముందుకు సాగితే, ఎంతటి మహా కార్యాన్ని అయిన సాధించ వచ్చనే సత్యాన్ని మరో సారి నరేంద్రుని రూపంలో సాక్షాత్కరించ బడింది. ఒక రాజకీయం లోనె కాదు, వివిధ రంగాలలో విజయ పతాకాన్ని ఎగురవేసిన వారందరు స్ఫూర్తి ప్రదాతలుగా ముందుకు నడుద్దాం.
భారత్ మాతకీ జై.