BREAKING

http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

అంతా అమ్మ దయ.. 

రాజధానిలో కాంగ్రెస్ నేతల మకాం 


- ఎమేల్సి పదవుల ఫై తాజా మాజీల కన్ను..  

- అమ్మ పై కొండంత ఆశ.... 

- కోటరీ చుట్టూ ప్రదక్షణ లు.. 

(విధాత ప్రతినిధి - న్యూ డిల్లీ)
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తెలంగాణా కాంగ్రెస్ తాజా మాజీలు ప్రస్తుతం డిల్లీలో యమ బిజీ గా ఉన్నారు. ఊహించని రీతిలో టి ఆర్ ఎస్ చేతిలో పరాజయం పాలైన మంత్రులు, సీనియర్ ఎమ్మేల్యేలు ఎలాగోలా ఎమ్మెల్సి పదవులు దక్కించు కుంటే తప్ప మనుగడ ఉండదని భావిస్తున్నరేమో... పోటా పోటీగా ఎమ్మెల్సీ టికెట్ ప్రయత్నాలు చేస్తూనే  ఉన్నారు. సోనియా అమ్మ కరుణా కటాక్షం కోసం చక్కర్లు కొడుతున్నారు. పనిలో పనిగా డిగ్గి రాజా.. అదే మన దిగ్విజయ్ సింగ్ సారును కూడా కలుసుకొని కొంచం దయ చూడుండి సారు. అని చెప్పుకొని అస్తాండ్రు.  జిల్లాల్లో స్తానిక ప్రజా ప్రతినిదుల  ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి నెలలో ముగుస్తున్నది.   

శ్రీధర్ బాబు 


రాజ గోపాల్ రెడ్డి 

సబితా 
సర్వే 
ఇగ కరీంనగర్ నుండి మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నం చేస్తున్నడో.. లేదో గాని.. గాయాన పేరు మా త్రం మస్తుగా వినిపిస్తాంది. చదువుకున్నోడు. మంచి పేరున్న కాంగ్రెస్ లీడర్లల్ల  ఒకడు. అలాగే నల్ల్గొండ నుండి  మాజీ ఎంపీ కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్నది. ఇగ మన జానా రెడ్డి సారూ కూడా  తన కొడుక్కు  ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి ,  కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, 










4, ఫిబ్రవరి 2015, బుధవారం

తెలంగాణాలో స్వైన్ మరణ మృదంగం.... 
- భయం  నీడలో ప్రజలు..
- నివారణ చర్యల్లో ప్రభుత్వం ... 
******  మీ కోసం కొన్ని చిట్కాలు...  


(విధాత ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణాలో స్వైన్ స్వైర్య విహారం చేస్తున్నది. ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  కేవలం రాష్ట్ర రాజధానిలో ఇప్పటికి 95 మంది చికిత్స చేయిన్చుకుంటుండగా,  జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ విదంగా నియంత్రించాలనే  విషయంలో అటు ప్రభుత్వం, ఇటు డాక్టర్లు కుస్తీ పడుతున్నారు. స్వైన్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందే  వైరస్ లలో ఒకటి కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం  ద్వారా దీన్ని నివారించవచ్చు. స్వైన్ ఫ్లూ వైరస్ తో ఉన్న వ్యక్తులతో కలసినప్పుడు ప్రతి వ్యక్తి ఫై ప్రభావం ఉండక పోవచ్చు. కొంతమంది రోగనిరోధక శక్తి వ్యవస్థ బలంగా ఉండడం మూలంగా వైరస్ ప్రభావం ఉండదు . అందువలన అది బలమైన ఎగువ శ్వాసకోశ ట్రాక్ ఆరోగ్యకరమైన మరియు రోగనిరోధక శక్తి వ్యవస్థను ఉంచుకోవాలి.  కొన్ని స్వైన్ ఫ్లూ నివారణ చిట్కాలు డాక్టర్ల సూచన మేరకు అందిస్తున్నాము. వీటిని ఇంటిల్లి పాది పాటించి ఆరోగ్యంగా ఉండండి.

 * ద్రవాలు బోలెడంత తీసుకోండి...
* రోజుకు ఎనిమిది గంటలు నిద్ర తప్పని సరి...
*  పోషకమైన ఆహారంలో, తాజా కూరగాయలు మరియు పండ్లు చేర్చండి
* సిగరెట్లు కాల్చే వారితో  పిల్లలకు  దూరంగా ఉంచండి.. 
* తరచుగా చేతులు కడగడం..
* స్వైన్ ఫ్లూ రోగుల నుండి దూరం ఉంచడానికి ముఖం ముసుగులు ధరించడం మంచిది.
* మధుమేహ వ్యాది ఉన్నవారు  మరియు మద్యపాణం సేవించే వారు అదనపు జాగ్రత్త తీసుకోవాలి...
* 70 సంవత్సరాల పైన రెండు సంవత్సరాల కింద పిల్లలు మరియు పెద్దల వ్యాధినిరోధక శక్తి వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  అందువలన వారు మంచి సంరక్షణ తీసుకోవాలి..
* స్వైన్ ఫ్లూ నివారణకు కేవలం ముఖం ముసుగులు ధరించినంత మాత్రమె సరిపొదు.  స్వైన్ ఫ్లూ నిరోధించడానికి ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
* ఫ్లూ లక్షణాలు ఉన్న రోగుల ఇరవై నాలుగు గంటలు ఇతరుల నుండి దూరంగా ఉండాలని ఉంది. స్వైన్ ఫ్లూ రోగుల నుండి కనీసం 6 అడుగుల దూరం ఉంచండి.
* స్వైన్ ఫ్లూ కోసం హోమియోపతి నివారణ ఔషధం రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది ఇది కీలక శరీరం యొక్క భాగాల్లో  పనిచేస్తుంది. ఈ మందులను వాడడం ద్వారా  స్వైన్ ఫ్లూ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ.
* స్వైన్ ఫ్లూ వైరస్ సమర్థవంతంగా వైరస్ పోరాడటానికి ఆగస్టు, సెప్టెంబరు మరియు అక్టోబరు నెలల్లో ప్రజలకు ఇచ్చిన  కొన్ని సందర్భాలలో టీకాలు బాగా పని చేయకపోవచ్చు.. వైరస్ శరీరం లో ప్రవేశించిన తరువాత టీకా వేసి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తెరుగాలి...     

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

తెలంగాణా భవిష్యత్తు ప్రణాళిక... 
- మూడు ప్రాధాన్యత రంగాలు.. 
- బంగారు తెలంగాణా సాధనకు కృషి... 
( కొంపెల్లి నుండి విధాత ప్రతినిధి)
హైదరాబాద్ కొంపెల్లిలో తెలంగాణా రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొని, ప్రసంగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన తరువాత ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, భవిష్యత్ కార్యాచారణఫై కార్యకర్తలు, నాయకులకు  దశ నిర్ధేశం చేశారు. 
 పేదల సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలను మూడు ప్రాధాన్య రంగాలుగా తీసుకొని ఆయా రంగాలలో అభివృధికి బాటలు వేయాలని సుచించారు. బీడీ కార్మికులకు వేయి రూపాయల జీవన భృతి మార్చి ఒకటో తేదీ నుండి అమలవుతుందని. ఈ విషయంలో ఏమయినా సమస్యలుంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరిపి అర్హుడైన వారికి భృతి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేశామని, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి రైతులను మోసం చేశాడని దుయ్యబట్టారు.  17వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేశామని, మొదటి విడతగా రూ.4250కోట్ల విడుదల  చేశామని, 480 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి కార్యక్రమం వచ్చే బడ్జెట్ తరువాత ఊపందుకుంటుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ, ఉద్యోగుల విభజన పూర్తయిన తరువాత  జరుగుతుందని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, అందులో భాగంగా మొదటి ధఫా పూర్తి అయ్యిందని, రెండవ దఫా అమలు కావాల్సి ఉందన్నారు.  తెలంగాణా ఆవిర్భావ దినోత్శావం లోగా  అన్ని జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్థూప కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ఇంక్రిమెంట్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.  హైదరాబాద్ లో పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని చట్టం చేశామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం, మన ఊరు మన ప్రణాళిక, కాకతీయ మిషన్ తో పాటు మరెన్నో కార్యక్రమాలు చేపత్తామని అన్నారు. ప్రధానమైన విద్యుత్ సమస్య తీర్చడానికి సకల చర్యలు తీసుకుంటున్నామని ,  ఎన్టీపీసీ 4వేల మెగావాట్లు..జెన్ కో 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు.  నవంబర్ లో 2వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని,  ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తిసుకుంటామన్నారు. 


ప్రతిపక్షాలు విమర్శలపై ఆయన స్పందిస్తూ... అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి డి.కే. అరుణ ఏమి మాట్లాడుతున్నారో అర్థం లెదన్నారు.