BREAKING
http://telangana-vidhatha.blogspot.in/ BREAKING NEWS ప్రముఖు పుష్కర స్నానాలు
7, నవంబర్ 2014, శుక్రవారం
మాటల తూటాలతో సిద్ధం..
హైదరాబాద్ విధాత ప్రతినిధి :అధికార పక్షంపై ప్రతిపక్షాలు మాటల దాడికి సిద్ధమయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచిన ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్ర్తశస్ర్తాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్‌పై వాడివేడి చర్చ సాగనుంది.
క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు...
తెలంగాణలో తీవ్రంగా క్షోభపెడుతోన్న రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలపై సర్కార్‌ను సభలో నిలదీయాలని విపక్షాలు సిద్ధమయ్యాయి. మూకుమ్మడిగా మాటల దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. కేవలం కొన్ని రంగాలకే బడ్జెట్‌ను కేటాయించారని, అన్ని వర్గాలను సంతృప్తి పర్చకపోవడం వల్ల బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విపక్షాలు సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి.
హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలం...
విద్య, ఉద్యోగం, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని విమర్శస్తున్న విపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో సర్కార్ విఫలమైందని ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే.. హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నాయి విపక్షాలు. సభలో ప్రజల తరుపున ప్రజా వాణిని వినిపిస్తామంటున్నాయి.
వాడివేడిగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు...
మరోవైపు లక్షకోట్ల బడ్జెట్‌ను సమర్థించుకునేందుకు సర్కార్ రెడీ అవుతోంది. విపక్షాల దాడికి ఎదురుదాడి చేయాలని సిద్ధమవుతోంది. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతల సంక్షోభాలకు గత ప్రభుత్వాలే కారణమంటూ లెక్కలను సిద్ధం చేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతు ఆత్మహత్యల లిస్టును సభ ముందుంచేందుకు రెడీ అయ్యింది. మొత్తంగా సభలో విపక్షాలు, అధికార పక్షం మధ్య చర్చలు వేడెక్కించనున్నాయి.
- బడ్జెట్ పై చర్చ
- విమర్శనాస్త్ర శాస్త్రాలతో ప్రతిపక్షాలు
- తెలంగాణా శాశన సభలో వాడి వేడి చర్చ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)