జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు షురూ ..
- పరిషత్ ఎన్నికల్లో పై చేయి ఎవరిదో..?
అందరి చూపు మంథని వైపు..
మంథని (విధాత) : పరిషత్ పాలకులు ఎవరో నేడు తేలనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీస్గా సాగిన పల్లె పోరులో పోటీ పడిన నేతల భవితవ్యం వెల్లడి కానుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మంథని డివిజన్ లోని ఏడు మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు డివిజన్ కేంద్రం లో ప్రారంబం అయ్యాయి. సూరయ్యపల్లె మేరి మీడియా ట్రిక్స్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలికల కాలేజీ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నాయకులూ, పార్టీ కార్యకర్తలు గుమిగూడి ఎవరికీ వారే అంచనాలు వేస్తున్నారు. ఈ ఎన్నికల పలితాలను ఆదారంగా సార్వత్రిక ఎన్నికల పలితాలను బీరిజు వేయవచ్చని పరిశీలకులు భావిస్థున్నారు. అర్ధ రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగవచ్చని అధికారులు పెర్కొన్తున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటముల పై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు సమాచారమ్.
