తెలుగు పత్రికల శైలి అధునాతన రీతిలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరం కన్నా ఎక్కువ పొగడడం, మితిమీరి తెగడడం తెలుగు పత్రికలకు అలవాటుగా మారింది. అయితే పోటీ ప్రపంచంలో ఇది సాదారణమని భావిస్తే పాఠకులను ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నామనే మౌలిక విషయాన్నీ మరిచి పోతున్నారు. పత్రికలూ ఎలా వ్రాస్తే, పాఠకులు అలా స్పందిస్తరనే బూర్జువా అభిప్రాయాన్ని తొలగించుకోవల్సిన అవసరం ఉంది. పత్రికలు చదివేవారు, అధ్యయనం చేసేవారు, తమ పేరు, ఫోటో చూసుకొని సంతోషపడేవారు, తమకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, పార్టీ paranga వ్యతిరేకంగా ఉన్నవారికి సంబంధించిన నెగటివ్ వార్తలు ప్రచురితమైతే సంతోషించే వారు చాలామంది ఉంటారు. అలాగే తమకు ఆత్మ బంధువులు, ఇస్తమినవారు, తమ నాయకులకు సంబంధించిన పాజిటివ్ ప్రచురణలు కూడా అదే స్థాయిలో గొప్పగా ఫిలయ్యేవారి సంఖ్య కూడా ఉంటుంది. వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వార్తలు ఎక్కువ స్థాయిలో ప్రచురించడం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర.
అయితే.. కొన్ని పత్రికలు ఉన్నది ఉన్నట్లు.. కాకుండా తమదైన శైలిలో వక్రీకరించడం పరిపాటిగా మారింది...
అది ఈ స్థాయిలో జరుగుతున్నది అనే విషయాన్నీ చర్చిద్దాం..
పాఠకులకు అందిచాల్సిన సమాచారాన్ని సైతం కొన్ని పత్రికలూ హైజాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ, దేశ, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఉన్న్డునట్లు అందిచాల్సిన పత్రికలూ, స్వంత కవిత్వాన్ని జోడించి, మాల్ మసాల గుప్పించి పాఠకులను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చాల చేస్తున్నట్లు గమనించే వారికి ఇట్టే తెలిసి పోతుందనే నగ్న సత్యాన్ని ఇప్పటికయినా తెలుసుకోవాలి.
నిజమయిన వార్తలు అందించే పవిత్ర వ్రుతిలో ఉన్నాజర్నలిస్టులు సయితం, యాజమాన్యాన్ని ఒప్పించేందుకు సహసించలేని స్థితిలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారునగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అదే ప్రవ్రుత్చిని అలవ్రుచుకొని మనసు చంపుకొని ఎంతమంది వ్యవహరిస్తున్నారో...
ఒక తెలుగు దిన పత్రిక వ్యతిరేఖంగా వ్రాసేందుకు అలవాటు పడి, వార్తలఉ, ఎడిటోరియల్, కాలమ్స్ తో పాటు కనీసం గ్రహ ఫలాలు కూడా వ్యతిరేఖంగా ఉండేలా ప్రచురించడం గమనార్హం. అంటే పాఠకులను అన్ని విధాలుగా నెగటివ్ ఆలోచనలు చేసే విధంగా, నిరాశ, నిస్పృహ నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలియని అలజడి పాఠకుల్లో జనిస్తుంది. దీంతో వ్యతిరేఖంగా ఆలోచించే పాఠకుడు తప్పని పరిస్థుల్లో, తనకు తెలియకుండానే విషపురితమవుతఆడు. ఇది ఎవరిని ఉధరించెందుకో అర్థం కాదు...
ఇప్పటికయినా మనసు మార్చుకొని, పాఠకులకు ధైర్యాన్ని, మంచిని, పోసిటివ్ దృక్పథాన్ని, ఆశావాద తత్వాన్ని అందించే విధంగా పత్రికలను మల్చకుంటే, జరిగే దుష్పలితాలకు కారణ భూతాలు పత్రికలేనని భావించే ప్రమాదముంది...
1 కామెంట్:
Yes i agree to this matare. now some news papers are doing some self based develoment triks to support there own people
కామెంట్ను పోస్ట్ చేయండి