12, మే 2014, సోమవారం

ELECTION RESULTS

కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పలితాలు టీ.అర్.ఎస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీ.అర్.ఎస్ హవా కనిపించి, 16న సార్వత్రిక ఎన్నికల పలితాల పై అంచానాలు వెస్తున్నారు. 

కరీంనగర్  కార్పొరేషన్‌ టీఆర్ఎస్‌ గెలుచుకోగా రామగుండం కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ దక్కించుకుంది.  కరీంనగర్  కార్పొరేషన్‌ లో 50స్థానాల్లో టీఆర్ఎస్‌-22స్థానాల్లో విజయం సాధించింది. రామగుండంలో 50 స్థానాలకు కాంగ్రెస్‌ 20 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో టీఆర్‌ఎస్-6, కాంగ్రెస్-2, బీజేపీ-1స్థానాలను కైవసం చేసుకున్నాయి.

జమ్మికుంట, హుజురాబాద్‌, సిరిసిల్ల, మెట్‌పల్లిలను టీఆర్ఎస్ వశమయ్యాయి. జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. వేములవాడ మునిసిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. 20స్థానాలకు బీజేపీ-9, ఇండిపెండెంట్లు-6, కాంగ్రెస్‌-3, టీఆర్ఎస్‌-3 స్థానాలు గెలుచుకున్నాయి. పెద్దపల్లిలో మొత్తం 20స్థానాలకు టీఆర్ఎస్-6, కాంగ్రెస్-6, టీడీపీ-3, ఇతరులు-5 గెలిచారు.