24, మే 2014, శనివారం

కసరత్తు పూర్తయింది  ... 

- తెలంగాణా మొదటి మత్రులుగా 9 మందికి చోటు
- అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం
 - మంత్రి వర్గంలో కరీంనగర్ జిల్లా నుండి ఇద్దరికీ ప్రాతినిధ్యం 

( విధాత ప్రతినిధి - హైదరాబాద్ )

నూతనంగా జూన్ 2 న ప్రమాణం చేయనున్న కే.సి.ఆర్. మంత్రి వర్గంలో కరీంనగర్ జిల్లా నుండి ఇద్దరికీ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిసింది.  జిల్లాకు చెందినా సిరిసిల్లా శాశన సభ్యులు కె.టి.ఆర్ తూ పాటు ఈటెల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నయి. అయితే మొదటి సారి మంత్రి వర్గం లో ఎవరిని తీసుకోవాలనే విషయం లో తర్జన, భర్జన చేసిన కే.సి.ఆర్.చివరకు 9మందికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 
                 అయితే మొదట ఆయన లక్కీ నెంబర్ 6 కావడంతో అంత వరకు మాత్రమే మంత్రి వర్గం లో తీసుకోవచ్చని భావించారు. కాని దీని వాళ్ళ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వక పోతే ప్రారంభం లోనే నాయకుల్లో అసంతృప్తి చెలరేగవచ్చని పార్టీ పరిశీలకులు అలా కాకుండా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చేవిదంగా చూడాలని సూచించినట్లు తెలిసింది. 
                అవసరమైన పక్షం లో తన కుమారున్ని, అల్లున్ని రెండవ జాభితాలో ఇచ్చేవిదంగా ముందే నిర్ణయించుకున్నట్లు, అల కాకుంటే 9 మందికి అవకాశం ఇవ్వాలని, ఆ సంఖ్యా కూడా మంచిదేనని  సర్దుకున్నట్లు తెలిసింది. అయితే ఈ టీంలో కే.సి.ఆర్ తనయుడు కే.టి.ఆర్. తో పాటు మేనల్లుడు హరీష్ రావుకు మొదటి జాబితాలో మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. 
                 అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి వలస వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ముఖ్య మంత్రి జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావుకు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు, టి.డి.పీ నుండి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ అదృష్టం వరించింది. అయితే వారికి ఏ.. ఏ శాఖలు ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.   

లక్కీ మంత్రులు వీరే ..?

తెలంగాణా రాష్ట్రము లో మొట్ట మొదటి సారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే మహా భాగ్యం వీరికే కలగనుంది. వీరిలో  కె. సి. ఆర్. మేనల్లుడు హరీష్ రావు (మెదక్ జిల్లా), కుమారుడు కెటి రామారావు (కరీంనగర్ జిల్లా), మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు (మహబూబ్‌నగర్ జిల్లా), మధుసూదనాచారి (వరంగల్ జిల్లా), ఈటెల రాజేందర్ (కరీంనగర్ జిల్లా), జలగం వెంకట్రావు (ఖమ్మం జిల్లా), జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) , పోచారం శ్రీనివాస రెడ్డి (నిజామాబాద్ జిల్లా), జగదీశ్వర్ రెడ్డి (నల్లగొండ జిల్లా) తొలి విడత కెసిఆర్ మంత్రివర్గంలో చేరుతారని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి