15, మే 2014, గురువారం

AWAITING FOR ELECTION RESULT

ఇంకా తెలవారదేమి... 
- రాజకీయ పార్టీలలో టెన్షన్...టెన్షన్..టెన్షన్.. 

(విధాత - మంథని)
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాలలో ఒకటే ఉత్కంఠ. ఇక కొన్ని గంటలలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించినందున  ఫలితాలు త్వరితగతిన వెల్లడవుతాయి.  ఉదయం 11 గంటలకే కొందరు విజేతలు తెలిసిపోతారు. అంతేకాకుండా ఎక్కడ ఏ వ్యక్తి లీడింగ్ లో ఉన్నారో,  ఏ పార్టీ లీడింగ్ లో ఉందో కూడా తెలిసిపోతుంది. దాంతో ఉత్కంఠకు తెరపడుతుంది.

దేశవ్యాప్తంగా 9 విడతలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణాలోని 119 శాసనసభ స్థానాలకు,17 లోక్ సభ నియోజక వర్గాలకు  ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175  శాసనసభ, 25 లోక్ సభ నియోజక వర్గాలకు మే 7న ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో తెలంగాణ, ఏపిలలో రెండు విడతలుగా పోలింగ్ జరిగినా, ఓట్ల లెక్కింపు మాత్రం రెండు ప్రాంతాలలోనూ రేపు ఉదయమే మొదలు పెడతారు. ఇప్పటికే వివిధ ఎగ్జిట్ పోల్స్ ద్వారా దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది పరిశీలకులు ఒక అంచనాకు వచ్చారు. ఎంత అంచనా ఉన్నా ఫలితాలు తెలిసే వరకు ఆ టెన్షన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. బెట్టింగులు కాసినవారి టెన్షన్ అయితే చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలలో కూడా ఇక్కడి ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల వ్యవహారం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది.
ఎవరి ధీమా వారిదె....
తెలంగాణా లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ లకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై ఎవరికీ వారే అంచనాలు వీసుకుంటున్నారు  13న వెలువడిన జెడ్పీ ఎన్నికల పలితాలను బట్టి కూడా తమకు అనుకూలంగా వస్తే ఆ పలితాలే పునారావృతం అవుథయని. వ్యతిరేఖంగా వస్తే  అప్పటికి, ఇప్పటికి వ్యత్యాసాముంటుందని ఎవేరికి వారే వ్యాక్యానించు వస్థున్నరు. కొంత మంది అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనైనా గట్టెక్కుతామనే ఆశతో ఉండేవారు ఉంటారు. అటువంటి వారు మరీ ఎక్కవ ఉత్కంఠకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితి మరీ ఉత్కంఠను రేపుతోంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. దాంతో ముందు నుంచి మంచి ఊపుమీదున్నరెండు పార్టీ లు సై అంటే  సై అన్తున్నారు. పలు ఎగ్జిట్ పోల్స్ వివిధ రకాలుగా వ్యాక్యానిస్తున్నారు.  ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా, ఎన్ని లెక్కలు చూపినా, ఎగ్జిట్ పోల్స్ ఏం తెలిపినా అందరి ఉత్కంఠకు రేపు మధ్యాహ్నమే తెరపడేది. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు. మొదటి విడత పోలింగ్ జరిగిన వారు నెలా 14 రోజులుగా ఈ టెన్షన్ అనుభవిస్తున్నారు. 
క్రాస్ వోటింగ్ భయం... 
అయితే క్రాస్ వోటింగ్ భయం మాత్రం అన్ని పార్టీ లలో పత్తుకున్ది. నిన్న మొన్న వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చాల ప్రాంతాల్లో ఒక పార్టీ కి ఒక ఓటు, మరో పార్టీ కి ఒకటి వేసినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్ది. తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ కు... తెచ్చినందుకు టి ఆర్ ఎస్స్ కు వేసినట్లు ఫలితాలు చెబుతున్నాయి. జెడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్థుల మొత్తం ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం ద్యొతకమవుతున్నది.