4, జనవరి 2010, సోమవారం

గొబ్బూరి కవిత సుమాంజలి

గొబ్బూరి నాగరాజు ప్రస్తుతం జెర్మనీ లో ఉంటున్నారు..
ఆయన
మంథని మీద కవిత రూపంలో అందించిన అవాజ్యమైనప్రేమను స్హ్లాగైస్తూ...


యాస ఒకటి లేకున్నా, భాష ఒకటి లేకున్నా
ఎవ్వడు ఎక్కడ ఉన్నా,, జిందాబాద్ మంతెన్నా
భౌతికంగా నీ ఒళ్లో లేకున్నా మంతెన్నా
మనసులోన నిన్నెప్పుడు తలుస్తూనే ఉంటున్నా!!!

భోజనాలు గుర్తుకొస్తే నోట్లో నీళ్ళ ఊట పుట్టె
((ganpathi boynaalu virgajampi vidichipettedi :))
దోస కయ ఆవ లేదు, పాశం గారే బొండల్లేవు
(exclusive manthenna recipes))
ఆలు బాత్, కేసరన్నం, ముద్ద పప్పు మంచి నెయ్యి,-
((exclusive manthenna రేసిపే))
చల్ల చారు, బిళ్ళ వక్క, గుమ్మడికాయ బరడ లేదు !
((exclusive manthenna recipe ))

"సీతా రామ స్వామి నేను చేసిన నేరమేమి" లేదు
((songs loved by most in manthani(may not be exclusive to MNT)
"దత్త దత్త బోలో,,, ఆనంద మస్త డోలో" లేదు
((songs loved by most in manthani(may not be exclusive to MNT)
శ్రావణ మాసం బళేర్ హనుమాన్ ఎక్కాహం భజనల్లేవ్-
((sacred place nr to MNT(some 2 Kms), whr we go n do bhajans in Shravana masam
దసరా నవరాత్రుల్లేవ్, ఆ చల్తీ పాటల్లేవ్ !-
((we dont stop "Thala" in Mahalaxmi temple until Navarathrulu finishes

గద్దె మీది బాతాలంటే "మంతెన్న లో వల్డు ఫేమస్"-
(("Baathalu= chit chatting :))" has its own importance in MNT culture
దునియా మీది "KT " అంత గద్దె మీది బాతాల్లోనే
((KT= KnowledgeTransfer; Gadde=big stone usually under a tree, or some place to sit n chat
అమ్మయ్య వచ్చి పిల్చేదాంక గద్దేమీంచి లేచుల్లేదు
((I hope some of u remember ur mom shouting "emayeraaaaa inka rathri kaledaaaaa" :))))
ఒంటిగంట కొట్టేదాంక "బాతాఖాని" ఆపుల్లేదు !-
(("బాతాఖాని"= baath+kahani merged :))

పోద్దునట్టే లేచేటాల్లం, "కచ్రం" కట్టి వేల్లెటాల్లం
((కచ్రం"= bullock cart
గంగాస్నానం చేసేటాల్లం, గుళ్ళు తిరిగి మొక్కేటాల్లం
((can never forget the pious Godavari area n surrounding temples
గంగ లేదు, గుళ్ళు లేవు,,షవరు కింద స్నానాలాయే
దత్త గుళ్ళు , గోదారేమో మల్ల మల్ల గుర్తు వచ్చే !

నే తిరిగిన ఆ వాగులు, ఆడుకున్న ఆడి బళ్ళు
మొక్కిన ఆ బోడ గుళ్ళు, చదువునేర్పినా స్కూళ్ళు
"భోజన", "భజన"," ప్రజ" లే నా ఊరికి ఆనవాల్లు
"ఉన్న ఊరు, కన్న తల్లి" తల్చుకుంటే గుండె దిగులు !

యాస ఒకటి లేకున్నా, భాష ఒకటి లేకున్నా
ఎవ్వడు ఎక్కడ ఉన్నా,, జిందాబాద్ మంతెన్నా
భౌతికంగా నీ ఒళ్లో లేకున్నా మంతెన్నా
మనసులోన నిన్నెప్పుడు తలుస్తూనే ఉంటున్నా!!!

Nagaraj.Gobburi
Germany

2, జనవరి 2010, శనివారం

లగడపాటి.. రాజకుమారి పెళ్లి సందడి..

గుంజపడుగులో... లగడపాటి .. రాజకుమారి పెళ్లి సందడి.
మన గుంజపడుగులో.. తెలంగాణా ఉద్యమకారులు అధ్బుత రీతిలో నిరసన వ్యక్తం చేశారు..
సమైక్యాంధ్ర అంటూ రెండు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందినా వీరిదరు ఒకరికి ఒకరు ప్రేమ ఒలకపోసుకోవాదాన్ని చిత్రీకరిస్తూ ఈ తంతు వెలది ప్రజల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. ఆ ఫోటోలు చూడండి....
గుంజపడుగలో గడపాటి, నన్నపనేనిల విహాహాం

తెలంగాణా ప్రాంతానికి ద్రోహులుగా మారిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించి వారిద్దరి డూప్‌లకు శనివారం తెలంగాణా సాంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహాం జరిపించి ఐదు గ్రామాల ప్రజలకు భోజనాలు ఏర్పాటుచేసి వినూత్న రీతిలో నిరసన తెలిపిన సంఘటన మంథని మండలం గుంజపడుగ గ్రామంలో జరిగింది. వివరాలు ఈవిధంగా ఉన్నాయి గుంజపడుగ గ్రామంలోని అన్ని పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు కలిసి ఐక్యకార్యచరణకమీటీ పేరుతో గత వారం రోజుల నుండి రిలే నిరాహారదీక్షలు చేస్తూన్నారు. శనివారం వారు వినూత్న రీతిలో తెలంగాణా ఏర్పాటుకు మొదటి నుండి అడ్డంకిగా ఉన్న లగడపాటి రాజగోపాల్‌, నన్నపనేని రాజకుమారిల వేషదారణతో ఉన్న ఇద్దరి వ్యక్తులకు వందలాది మంది సమక్షంలో తెలంగాణా పద్దతిలో వారికి వివాహాం చేశారు. గ్రామంలోని ప్రజలతో పాటు మంథని మండలంలో వివాహానికి సంబంధించి కార్డులను పంపిణీ చేశారు. శనివారం లగడపాటి రాజగోపాల్‌ (సాదుల ధర్మరాజు), నన్నపనేని రాజకుమారి (కన్నం రాజ్‌కుమార్‌)వేషదారణలతో ఉన్నవారికి ఎదుర్కొలు కార్యక్రమాన్ని నిర్వహించి వారిని ఊరేగింపుగా స్థానిక బస్టాండ్‌ మంథని-గోదావరిఖని ప్రదాన రహాదారిపైన ముత్యలపందిరి వేసి వారికి వేదమంత్రాల నడుమ తంగేడిపూలతో అక్షింతలు వేసి పసుపుకొమ్ముతో తాళికట్టాడు.


అనంతరం వీరిదద్దరు పిచ్చిపూలు, తంగేడిపూలతో ప్రతే్యకంగా తయారుచేసిన దండలు ఒకరినొకరు మార్చుకున్నారు. వివాహం తరువాత గ్రామంలో బ్యాండుమేళాలతో బారత్‌ నిర్వహించిన అనంతరం లగడపాటికి, నన్నపనేనికి అందరు కట్నాలు చదివించారు. చెప్పులు, చీపుర్లు, చాటలు, చినిగిపోయిన బట్టలు, మురికిన కూరగాయలు కట్నాల రూపంలో వారికి అందజేశారు. నడిరోడ్డుపైన పెండ్లికి వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. వీరి వివాహం అయిన తరువాత లగపాటి వేషదారి, నన్నపనేని వేషదారి నృత్యాలు చేస్తూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దులు కురిపించుకున్నారు. వినూత్న రీతిలో చేసిన వీరి వివాహానికి గుంజపడుగు గ్రామంతో పాటు సిరిపురం, నాగారం, ఉప్పట్ల, పోతారం, దుబ్బపల్లి, మంథని తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

కాగా వీరికి కట్నాల రూపంలో సమకూరిన చెప్పులు, చీపుర్లు, మురిగిన కూరగాయలను కొరియర్‌ ద్వార విజయవాడలోని లగడపాటి ఇంటికి పార్శిల్‌ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం జె ఏసి నాయకులు సర్పంచ్‌ ఊదరి ఓదెలు, ఎంపిటిసి ఊదరి శంకర్‌, నాయకులు ఊదరి లచ్చయ్య, కొంతం రాజు, బొగె తిరుపతి, రాంపల్లి సమ్మయ్య, కుంట శ్రీనివాస్‌, వెంకటేశం, సుగుణాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. సందర్భంగా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపైన వాహానాలు నిలిచిపోయాయి.

గోనెప్రకాశ్‌రావు డూప్‌కు ఉరి

గుంజపడుగ గ్రామంలో ఒక పక్క లగపాటి, నన్నపనేని లవివాహాం జరుగుతుండగా తెలంగాణాలో పుట్టిపెరిగి ద్రోహాంచేసే విధంగా వ్యవహారిస్తున్న గోనె ప్రకాశ్‌రావు డూప్‌ను చెట్టుకు ఉరివేసి నిరసన వ్యక్తం చేశారు. నేనే తెలంగాణ ద్రోహిని అంటూ ఆయన చేతిలో ప్లకార్డులు పెట్టారు.








.





తెలంగాణా కోసం విష్ణు సహస్ర నమ పారాయణం చేస్తున్న మహిళలు